TOP NEWS

Wednesday, 24 November 2010

మహేష్‌ ఖలేజా’ అర్థ శతదినోత్సవం

మహేష్‌ ఖలేజా’ అర్థ శతదినోత్సవం
AA

సూపర్‌స్టార్‌ మహేష్‌, అనుష్క జంటగా త్రివిక్రమ్‌ రచన, దర్శకత్వంలో ఎస్‌. సత్యరామమూర్తి సమర్పణలో శింగనమల రమేష్‌బాబు, సి.కళ్యాణ్‌ కనకరత్న మూవీస్‌ పతాకంపై నిర్మించిన ‘మహేష్‌ ఖలేజా’ నవంబర్‌ 25కి విజయవంతంగా 50 రోజులు పూర్తి చేసుకుంది.

ఈ సందర్భంగా నిర్మాతల్లో ఒకరైన సి.కళ్యాణ్‌ మాట్లాడుతూ... ‘విడుదలైన అన్ని సెంటర్స్‌లో అద్భుతమైన ఓపెనింగ్స్‌ సాధించి అన్ని ముఖ్య కేంద్రాల్లో 50 రోజులు పూర్తి చేసుకొని శతదినోత్సవానికి పరులుగులు తీస్తున్న నేపథ్యంలో ఈ చిత్రాన్ని ఆదరించిన ప్రేక్షకులకు, అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

ఈ చిత్రానికి మహేష్‌బాబు పెర్‌ఫార్మెన్స్‌ హైలైట్‌ అని ప్రేక్షకులంతా ప్రశంసించారు. ముఖ్యంగా ఓవర్సీస్‌లో ఏ తెలుగు చిత్రానికీ రాని అద్భుతమైన షేర్స్‌ ‘మహేష్‌ ఖలేజా’ సాధించడం విశేషం’’ అన్నారు.

0 comments: