TOP NEWS

Saturday, 29 October 2011

The first look of Business man is going to be release on 11-11-11

'దూకుడు’ వంటి సెన్సేషనల్ హిట్ తర్వాత మహేష్ నటిస్తున్న చిత్రం బిజినెస్ మ్యాన్. ఆర్ ఆర్ మూవీ మేకర్స్ పతాకంపై పూరి డైరెక్షన్ లో డి వెంటక్ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం ముంబైలో జరుగుతోంది. ‘పోకిరి’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత మహేష్-పూరి జగన్నాథ్ ల కాంబినేషన్ లో ఈ చిత్రం రూపొందుతుండటం, అలాగే ‘దూకుడు’ తర్వాత వస్తున్న మహేష్ చిత్రం కావడం పైగా రామ్ గోపాల్ వర్మ ఈ చిత్రం గురించి ట్విట్టర్ లో ఓ రేంజ్ లో ప్రచారం చేస్తుండటంతో ఈ చిత్రంపై సర్వత్రా భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

ఆ అంచనాలకు తగ్గట్టే ఈ చిత్రానికి సంబంధించిన వర్క్ జరుగుతోంది. ప్రస్తుతం ఈ చిత్రం కోసం థమన్ సంగీత దర్శకత్వంలో టైటిల్ సాంగ్ ని అలాగే ఐటమ్ సాంగ్ ని రికార్డ్ చేశారని తెలుస్తోంది. టైటిల్ సాంగ్ ‘బాంబే బాంబే అనే పల్లవితో సాగుతూ తెలుగు, హిందీ పదాలతో సాగుతుందని అలాగే ఐటమ్ సాంగ్ ‘శ్రీరాముడు కాదు...శ్రీకృష్ణుడు కావాలి...వీ వాంట్ బ్యాడ్ బాయ్స్...అనే పల్లవితో సాగుతుందట. ఈ సాంగ్ కోసం సినిమాలో బాలీవుడ్‌ భామ శ్వేత భరద్వాజ్‌ ఐటమ్ సాంగ్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ పాట ఐదు రోజుల షూటింగ్‌ కు రెమ్యునరేషన్‌ ఆమెకు రూ.50 లక్షలు తీసుకొందని సమాచారం. ‘బిజినెస్ మ్యాన్’ ఫస్ట్ లుక్ పోస్టర్ 11-11-11న రిలీజ్ చేయబోతున్నారు. ఈ చిత్రాన్ని ఏకకాలంలో సింగిల్ షెడ్యూల్ లో పూర్తి చేసి జనవరి 12వ తేదీన విడుదల చేసేందుకు సన్నాహాలు యుద్దప్రాతిపదికన సాగుతున్నాయి.

0 comments: